Chekuru Dhananjaya Naidu, S/o. Venkatrama Naidu filed a consumer case on 04 Aug 2015 against The Depot Manager in the Chittoor-II at triputi Consumer Court. The case no is CC/72/2014 and the judgment uploaded on 05 Oct 2015.
చిత్తూరు జిల్లా వినియోగదారుల ఫోరం-ii తిరుపతి నందు.
ప్రస్తుతం: శ్రీ. యం. రామకృష్ణయ్య, అద్యక్షులు;
శ్రీమతి. టి. అనిత, సభ్యురాలు.
మంగళవారం,నాల్గవరోజు, ఆగష్టుమాసం, రెండువేలపదిహేనవ సంవత్సరము. (04.08.2015)
సి.సి. నెం. 72 / 2014
వయసు 48 సంవత్సరములు, ఇంటి నెం. 2/22, చంద్రగిరి మండలం, చిత్తూరు జిల్లా;
నేలటూరు గ్రామము, ఉదయగిరి మండలం, నెల్లూరు జిల్లా ;
గ్రామం, ఉదయగిరి మండలం, నెల్లూరు జిల్లా ;
కల్రోడ్పల్లి గ్రామం, చంద్రగిరి మండలం, చిత్తూరు జిల్లా ;
ఇంటి. నెం. 231, బైరాగిపట్టేడ, తిరుపతి;
ఇంటి. నెం. 231, బైరాగిపట్టేడ, తిరుపతి;
101, ఆదిత్యటవర్స్ , బాలాజీ కాలని, తిరుపతి ;
చంద్రగిరి మండలం, చిత్తూరు జిల్లా;
ఇంటి. నెం. 6-215 /4, హరిపురం కాలని, పేరూర్ మండలం, తిరుపతి;
ఇంటి. నెం. 19-9 -7 బి4, కెన్నడి నగర్, తిరుపతి;
మరియు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ, విజయవాడ;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, విజయవాడ;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, విజయవాడ ;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, వ్జయవాడ;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, విజయవాడ
శ్రీ. కే . వి. నారాయణ, డ్రైవర్, ఆటోనగర్ డిపో,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, విజయవాడ ............ప్రత్యర్దులు
ఈ వ్యాజ్యము, వినియోగదారుల సంరక్షణ చట్టము, 1986 నందలి సెక్షన్. 12 ప్రకారము దాఖలు చేయబడినది.
ఈ వ్యాజ్యము 22-07-2015 వ తేదీన మాసమక్షమున తుది విచారణకు స్వీకరించబడింది . పిర్యాదిదారుల ,మరియు ప్రత్యర్ధుల యొక్క న్యాయవాదుల వాదోపవాదనలు విని ,వ్యాజ్యామ్సములను , సమాధానము నందలి అమ్సములను సంబందిత ముఖ్య సాక్ష్యాదారాలను పరిశీలించి ఈ ఫోరం వెలువరించిన
తీర్పు
ఈ వ్యాజ్యము నందలి ముఖ్య అంశములు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కు చెందిన ఏ. పి 16 z 0153 నెంబరు గల మోటారు వాహనము (బస్సు),
28-09-2014 వ తారీకున విజయవాడ ఆటోనగర్ డిపో నుండి తిరుపతి కి బయల్దేరినది. అందులోని ప్రయాణికులు వేరు వేరు ప్రాంతములనుండి తిరుపతి కి ప్రయాణించుచున్నారు. ప్రయాణపు చార్జీల వివరములు ఒక ప్రయనికునికి-
విజయవాడనుండి తిరుపతి కి రూ .460/-; కావలి నుండి తిరుపతి కి రూ.217/-
నెల్లూరు నుండి తిరుపతి కి రూ.153/- మొదటి వాది కావలి నుండి తిరుపతి కి వెళ్ళుటకు ఇదే బస్సు లో ప్రయాణించు చున్నాడు. ఈ బస్సు నెల్లూరు నుండి వచ్చి నాయుడుపేట ప్రయాణ ప్రాంగణము నందు నిలిపివేసినారు. వాహన చోదకుడిని
కారణమడుగగా , వాస్తవానికి ఈ బస్సు చెన్నై కి వెళ్ళవలసివుంది కాని అక్కడ జయలలిత ను జైలుకు పంపిన కారణంగా ప్రయాణానికి అవాంతరాలు జరుగుచున్నo దున ఈ బస్సును తిరుపతి కి మల్లించినారు . ఇక్కడికొచ్చిన తరువాత చెన్నై లో గొడవలు సద్దుమనిగాయని తెలిసి మా డిపో రవానాధికారి మమ్ముల చెన్నై వెళ్ళమని అజ్ఞాపించినారు .కనుక మేము చెన్నై కి వెళ్ళాలి , మీకు వేరే బస్సు నెల్లూరు నుండి వస్తుంది అప్పటివరకు మీరు వేచి వుండండి అని చెప్పినాడు . అందుకు బస్సులోని ప్రయాణికులు వ్యతిరేకిన్చినారు .ప్రయాణీకులు వారియొక్క అసంతృప్తిని, మరియు ప్రత్యర్దు ల సేవాలోపం వల్ల ప్రయాణికులకు కలిగిన అసౌకర్యాన్నితెలియపరచేందుకు మూడవ ప్రత్యర్ది ని చరవాణి ద్వారా సంప్రదించగా, ఆయన మాట్లాడేందుకు నిరాకరించినాడు . బస్సు లో చిన్నపిల్లలున్నారు వారికీ, ఇతర ప్రయాణీకులకు కలిగే అసౌకర్యాన్ని నివారించే ప్రయత్నాలు చేయకపోగా, సిబ్బంది ప్రయాణీకులపై పోలీసులకు పిర్యాదు చేయ నుపక్రమించినారు . అట్టి స్థితిలో ప్రయానికులంతా ఒక్కటై ధర్నా చేసేందుకు సిద్ధమైనారు. ఆ సమయములో, నాయుడుపేట లోని రోడ్డు రవాణా సంస్థ అధికారులు కల్పించుకొని ప్రయాణీకులనుండి వినతి పత్రము తీసుకొని బస్సును తిరుపతి కి నడిపినారు .ప్రత్యర్దుల నిర్లక్ష్యము ,సేవలోపముల కారణంగా దాదాపు రెండు గంటల విలువైన సమయాన్ని ప్రయాణీకులు కోల్పోయినారు .
తత్ఫలితంగా ప్రతి ప్రయాణీకునికి నష్టము కలిగినది . ప్రయాణీకులలో కొందరు ఉద్యోగావకాశాలు కోల్పోగా , మరికొందరు చిట్ వేలం లో పాల్గొనలేకపోయారు, మరికొందరు వివాహ నిస్చితర్ధలలో పల్గోనలేకపోయినారు , మరికొందరు వైద్య పరీక్షలు చేయించుకోలేకపోయినారు . పై కారణాలవల్లనే ఈ వ్యాజ్యము దాఖలు చేయవలసిన ఆవశ్యకత ఏర్పడింది . కనుక,
1 . ప్రత్యర్డుల నుండి ప్రతి ప్రయాణీకుడికి మానసిక వ్యధ కలిగించినండుకుగాను ఒక్కొక్కరికి రూ.20,000/- చెల్లించ ఉత్తర్వులు ఇవ్వమనిన్నీ,
2 . ప్రత్యర్దుల యొక్క సేవా లోపానికి పరిహారంగా ప్రతి ప్రయాణీకుడికి
రూ.10,000/-నష్ట పరిహారం చెల్లించే టట్లు ఉత్తర్వులిమ్మనిన్నీ ,
3 . ప్రయాణీకులను హిమ్సిన్చినందుకు రూ .30,000/-ప్రత్యర్దులకు జరిమానా
విధించమనిన్నీ, మరియు,
4 . ఈ వ్యాజ్యపు ఖర్చులను ప్రత్యర్దుల నుండి ఇప్పించమని ఫోరం ను
పిర్యాదిదారులు కోరియున్నారు .
మొదటి ప్రత్యర్ధి (మొదటి ప్రతివాది) వారి జవాబును లిఖిత పూర్వకంగా సమర్పించి నరు . మిగిలిన 2 నుండి 6 వరకు ప్రత్యర్దులు 1 వ ప్రత్యర్ది యొక్క జవాబును వారి జవాబుగా అంగీకరిస్తూ మేమో దాఖలు చేసుకొన్నారు.
జవాబునందలి ముఖ్యాంశాలు :
ప్రత్యర్ధులు ,పిర్యాదుపై వారి అభ్యంతరాలు తెలుపుతూ; పిర్యాదు నందలి
ప్రత్యర్ధులు అంగీకరించిన విషయములు ...28.09.2014 వ తేదీన,
ఎ .పి .16 జడ్ 0153 నెంబరు కలిగిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు విజయవాడ ఆటోనగర్ ప్రయాణ ప్రాంగణము నుండి తిరుపతి వెళ్ళుటకు ఉదయం. 07. గంటలకు బయల్దేరింది .ఈ బస్సు విజయవాడ –చెన్నై మధ్య నడిచే బస్సు .
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను న్యాయస్థానం శిక్షించి జైలుకు పంపినందుకు నిరసనగా తమిళనాడు లో గొడవలు జరుగుచూ తమిళనాడుకు వెళ్ళే బస్సులకు అంతరాయం కలుగుచున్నందువల్ల ఈ బస్సును తిరుపతి కి మల్లిన్చడమైనది . విజయవాడ నుండి తిరుపతి కి వెళ్ళు మార్గమధ్యమున కావలి, నెల్లూరు , గూడూరు ,నాయుడుపేట మరియు శ్రీకాళహస్తి వంటి ముఖ్యమైన ప్రయాణ ప్రాంగణములందు బస్సును ఆపవలసివుంది. 2 నుండి 5 వరకు పిర్యాదిదారులు నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం వారు. వారు నెల్లూరు లో దిగిపోయినారు కనుక వారికీ కలిగిన అసౌకర్యమేమి లేదు. టికెట్ల సంఖ్య పిర్యాదిదారుల సంఖ్య తో సరిపడుట లేదు. పగటి ప్రయాణాలలో, చిన్న పిల్లల కోసం, వృద్దుల కోసం , మధు మేహ బాదితుల కోసం పలు చోట్ల బస్సు అపవలసి వస్తుంది ఫలితంగా ప్రయాణ సమయాల్లో కొంత జాప్యం జరుగుతుంది .
28.09.2014 వ తారీఖు న కూడా యిలాంటి జాప్యం కారణంగా బస్సు ఒక గంట ఆలస్యంగా తిరుపతి కి చేరింది . అందుకు పిర్యాదిదారులు అనూహ్యమైన రీతిలో అత్యంత ఎక్కువ పరిహారం కోరడం న్యాయ సమ్మతం కాదు . వొక్కొక్క పిర్యాదిదారునికి వాస్తవంగా కలిగిన నష్టమేమిటో పిర్యాదు లో వివరించలేదు .పై కరణముల వల్ల పిర్యాదు విచారణార్హత కోల్పోయినది. పిర్యాదును తిరస్కరించవలసినదిగా కోరియున్నారు .
పిర్యాదిదారులు, ప్రత్యర్ధులు ,వారి ,వారి సంబందిత ప్రమాణపత్రములను మరియు వాద , ప్రతివాదనలను లిఖిత పూర్వకముగా దాఖలు చేసియున్నారు .
పిర్యాదుల తరపున ఎ గ్జిబిట్. ఎ1 నుండి ఎగ్జిబిట్ ఎ5 వరకు నమోదైనవి .
అప్పోజిట్ పార్టీల తరపున ఎగ్జిబిట్ బి1 మరియు బి2 నమోదైనవి
పరిగణనలోనికి తీసుకొనవలసిన అంశములు :...
పిర్యాది దారులందరూ ప్రయాణించి యున్నారా ?
మొదటి అంశము : ఈ వ్యాజ్యము నందు ప్రముఖంగా పరిగణన లోకి తీసుకోవలసిన అమ్సమేమిటంటే, ఈ వ్యాజ్యమునండు 15 మంది పిర్యదిదారులున్నారు. కానీ మొదటి పిర్యాది మాత్రమే ఫోరం నందు ప్రారంభము నుండి ఇప్పటివరకు హాజరౌచున్నారు .అలా ఒక్కరే అందరి తరపున హాజరు కావాలంటే, వినియోగదారుల సంరక్షణ చట్టం లోని సెక్షన్.12 (సి) ప్రకారం ముందుగా ఫోరం యొక్క అనుమతి తీసుకోవడం తప్పనిసరి .ఇప్పటివరకు మిగతా పిర్యాడులెవరు ఫారంలో హాజరవటం కాని లేదా అలాంటి అనుమతి పొందటం గాని జరగలేదు .
ఈ వ్యాజ్యము 29.11.2014 వ తారీకున మొదటి పిర్యాదు ద్వారా ఈ వ్యాజ్యము దాఖలు చేసి ఉన్నారు .మిగిలిన 14 మంది లో 4 గురు చిన్న పిల్లలున్నారు (వారు 4, 5, 10, మరియు 15 వ పిర్యదిదారులు) మిగతా ప్రత్యర్దులలో ఏ ఒక్కరు కూడా ఫోరం లో హాజరు కాకుండానే మొదటి పిర్యాదికి వారి తరపున వ్యాజ్యాన్ని నడుపుటకు 04.04.2015 న అధికారమిచ్చినారు ఫోరం నందు ఏ నాడు హాజరు కాకుండా, పిర్యాదులో ను , ప్రమాణ పత్రాలలోను ,అధికార బదలాయింపు (authorisation) లోను దస్థూరి చేసినంత మాత్రాన వారి ‘గైరు హాజరు’ ను ‘హాజరు’ గా పరిగణిoచలేము.
ఈ వ్యాజ్యము నందు ప్రస్పుటమైన ఆరోపణ యేమిటంటే, 28.09.2014 తారీఖున ఏ .పి 16 జడ్ 0153 నెంబరు గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డో రవాణా సంస్థ యొక్క మోటారు వాహనము (సూపర్ లగ్జరీ బస్సు) విజయవాడ నుండి తిరుపతి వెళ్ళుటకు బయలు దేరింది.2 ,3 పిర్యాదిదారులు వారి పిల్లల (4 & 5 పిర్యాదిదారులు) తో విజయవాడ నుండి అదే బస్సు లో ప్రయాణిస్తున్నారు .మార్గమధ్యమున మొదటి పిర్యాది కావలి లో అదే బస్సు లో ఎక్కి తిరుపతి కి ప్రయాణిస్తున్నారు .మిగిలిన పిర్యాదిదారులు అదే బస్సు లో నెల్లూరు నుండి తిరుపతి కి ప్రయాణిస్తున్నారు .ఈ
మోటారు వాహనము నాయుడుపేట చేరి, ఆ ప్రయాణ ప్రాంగణము నందు దాదాపు రెండు గంటలు బస్సు ను నిలిపి వేసినారు .ఆలాస్యము నాకు కారణమేమిటని వాహన చోదకుని ప్రశ్నించగా , చెన్నై లో, ‘జయలలిత ను జైలుకు పంపినందుకు’ నిరసనగా గొడవలు చేస్తున్నారు, ఆ కారణంగా చెన్నై వెళ్ళవలసిన బస్సు ను తిరుపతి కి మరల్చినారు .చెన్నై లో గొడవలు సద్దుమనిగాయని ఇక్కడికొచ్చిన తరువాత తెలిసింది, మా అధికారులు మమ్ములను చెన్నై వెళ్ళమని ఆదేశించారు ,మిమ్ములను తిరుపతి కి తీసుకేల్లెందుకు వేరే బస్సు నెల్లూరు నుండి వస్తుంది’ అని చెప్పినాడు .దానికి అంగీకరించక ప్రయాణికులందరూ అక్కడే ధర్నా చేసేన్డుకుపక్రమిన్చినారు .సిబ్బంది ప్రయాణికులపై పోలీసు కేసు పెట్టేందుకు సిద్దపడ్డారు .అప్పుడు నాయుడుపేట ప్రయాణ ప్రాంగణ సిబ్బంది కల్పించుకొని అదే బస్సును తిరుపతి కి నడిపి నారు .ఇక్కడ జరిగిన రెండు గంటల ఆలస్యము వల్ల ప్రయ్యనీకులకు తీవ్ర అసౌకర్యము ,మానసికవ్యధ, నష్టము, పిల్లలకు అనారోగ్యము కలిగినవి.వీటన్నింటికి ప్రత్యర్ధుల నిర్లక్ష్యము , సేవా లోపామే కారణము . ఈ ఆరోపణ రుజువు చేసుకోవలసిన బాధ్యత పిర్యాడులపై ఉన్నది .పిర్యాదు లో గాని , ప్రమాణ పత్రములలో గాని ,పిర్యాదిదారుల తరపున దాఖలు చేసిన లిఖిత పూర్వక వాదన (arguments) లో గానీ ,....
1. 28.09.2014 న విజయవాడ లో ఎన్ని గంటలకు బస్సు బయల్దేరింది ?
2. ఎన్నిగంటలకు కావలికి వచ్చింది, మొదటి పిర్యాది కావలి లో ఎన్ని గంటలకు బస్సెక్కింది ?
3. నెల్లూరు కు ఎన్ని గంటలకు వచ్చింది ?
4. నెల్లూరు నుండి ఎన్ని గంటలకు బయల్దేరింది ?
5. నాయుడుపేట కు ఎన్ని గంటలకు చేరింది?
6. ఎన్ని గంటల నుండి ఎన్ని గంటల వరకు నాయుడుపేట లో నిలిపింది ?
7 . నాయుడుపేట నుండి ఎన్ని గంటలకు బయల్దేరింది ?
8 .తిరుపతి కి ఎన్ని గంటలకు చేరింది ? మొదలగు వివరాలు తెలుప లేదు .
ప్రత్యర్ధులపై నిశితమైన ఆరోపణలు చేస్తూ వారి నుండి పరిహారము కోరుచున్నపుడు , అట్టి ఆరోపణ లను నిస్సందేహంగా తగిన సాక్ష్యాధారాలతో ఋజువు చేసుకోవలసిన బాధ్యత పిర్యాదులపై ఉన్నది. పైన తెలిపిన సమయముల వివరాలు, సవివరంగా తెలుపనిదే ఇందులో వ్యాజ్య కారణమైన జాప్యమును నిర్ధారించుట అసాధ్యము. వ్యాజ్య కారణమైన ఆ “జాప్యమును” నిర్దారించనిదే లేదా ఋజువు
చేయనిదే, ప్రత్యర్ధుల యొక్క నిర్లక్ష్యము గాని, వారి యొక్క సేవాలోపమును గాని తేల్చ లేము లేదా నిర్దారించలేము .పైన తెలిపిన 1 నుండి 8 విషయాలను ఋజువు చేయుటకు ఇసుమంతైనా , సాక్ష్యమును ఈ ఫోరం నందు దాఖలు చేయుటలో
పిర్యాదిదారులు ఘోరంగా విఫలమైనారు. కనుక ప్రత్యర్ధుల పట్ల, ఎలాంటి నిర్లక్ష్యము గాని మరియు ఎలాంటి సేవా లోపము గాని లేదని మా అభిప్రాయము .
రెండవ అంశము : 28.09.2014 వ తేదీన పిర్యాడులందరూ ఏ .పి 16 జడ్ 0153 నెంబరు గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కు చెందినా మోటారు వాహనము నందు ప్రయానించినట్లు ఋజువు చేయుటకు ముఖ్యంగా ఎగ్జిబిట్ . ఎ5 పై పిర్యాదుల వ్యాజ్యం ఆధారపడివుంది . ఈ ఎగ్జిబిట్ నందు ఏడు టికెట్లు ఉన్నాయి. వీటిలో ఒక్కటి మాత్రం గణనయంత్ర జనితమైనది (Computerised print out), దీని ప్రకారం ఈ టికెట్ 28.09. 2014 న ఇద్దరు ప్రయాణికులకు విజయవాడ నుండి తిరుపతి కి ఇవ్వబడింది, బస్సు నెంబరు లేదు ,సర్వీసు నెంబరు లేదు. మిగిలిన ఆరు (6) టికెట్ల పై “ ఏ.పి.ఎస్.ఆర్.టి.సి” యొక్క అధికారిక చిహ్నము ఉండి, వెనుక వైపు కొన్ని అక్షరములు వ్రాయబడియున్నవి. ఉదా. VZ TPT.2; KVL.TPT ; NLR.TPT . వాటి ప్రకారం విజయవాడ నుండి తిరుపతి కి ఇద్దరు ప్రయాణికులు ,కావలి నుండి తిరుపతి కి ముగ్గురు ప్రయాణికులు , నెల్లూరు నుండి తిరుపతి కి ఏడుగురు ప్రయాణించి నట్లు అవగతమౌచున్నది. కాని ఏ టికెట్ ఎవరికీ చెందినవో చెప్పేందుకు తగిన ఆధారములు లేవు .మొదటి పిర్యాదీ ,మరియు నెల్లూరు నుండి తిరుపతి కి వచ్చినట్లుగా చెబుతున్న ఏడుగురు ప్రయాణికులు చిత్తూరు జిల్లాకు చెందిన వారే. వీరంతా నెల్లూరుకు ఏ పనిమీద వెళ్లారు ? ఎప్పుడు వెళ్లారు ? ఎక్కడా చెప్పలేదు. ఉదయగిరి తాలుకా, నేలటూరి గ్రామస్తులు, విజయవాడ నుండి వచ్చి నెల్లూరు లో దిగిపోయినారు అనే ప్రత్యర్ధుల వాదనను , ‘అసత్యమని’ పిర్యాదిదారులు ఎక్కడా వక్కాణిoచలేదు . ఫోరం లో ఎప్పుడు హాజరుకాని 2,3,6,7,8,9,11,12,13,14 పిర్యాదిదారులు అందరు ఒకేసారి 04.04.2014 వ తేదీన తిరుపతి కి ఎలా రాగలిగారు ? ఒకవేళ వీరంతా తిరుపతి కి వచ్చింది నిజమైతే తిరుపతి లోనే ఉన్న వినియోగదారుల ఫోరం కు ఎందుకు రాలేదో ఏ ఒక్కరి ప్రమాణ పత్రములొనూ చెప్పలేదు. కనుక వీరే ప్రయానిచారని చెప్పేందుకు తగిన సహేతుకమైన ఆధారాలు లేవని నిర్దారించాదమైనది .
మూడవ అంశము : పి.డబ్ల్యు .1 చేకూరు ధనుంజయ నాయుడు గారి ప్రమాణ పత్రము ప్రకారము బస్సు 02 గంటలు ఆలస్యమైనందువల్ల ఆయన a) చీటీ పాటను కోల్పోయాడు b) నిశ్చితార్దానికి హాజరు కాలేకపోయారు , c) అసోసియేషన్ సమావేశానికి హాజరుకాలేక పోయారు , d) పిల్లల అనారోగ్య సమస్య నెదుర్కొన్నారు .వీటికి సంబందంచి-చీటీ నెంబరు గాని ,ఎంత రొఖానికని గాని , పాత ఎక్కడ జరిగింది గాని , అలాగే ఎవరి నిశ్చి తార్ధమో ,ఎక్కడో, అలాగే ఏ అసోసియేషన్ సమావేసమో, ఎక్కడజరిగిందో, ఎన్నిగంటలకు జరిగిందో, ఎవరి పిల్లలు అనారోగ్యానికి గురైనారో మొదలగు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ప్రత్యర్ధుల ప్రకారం, ఆయన వృత్తి లో కొనసాగని న్యాయవాది ,వయసు 48 సం .ఇప్పుడు ‘జాబ్ మేలా’ కోల్పోవటం ఏమిటో?
పి .డబ్ల్యు 2 and 3 కల్లూరు తిరుపతయ్య ఆయన భర్య కల్లూరు సౌజన్య లు వారు దాఖలు చేసుకొన్న ప్రమాణ పత్రములందు ‘ప్రత్యర్ధులు 28.09.2014 వ తేదీన బస్సును ఆలస్యంగా గమ్యస్థానం చేర్చినందువల్ల , వారు ఇంటర్వ్యూ కు హాజరుకాలేక ఉద్యోగ అవకాశాన్ని కోల్పోయినారు అని ఆరోపించియున్నారు .ఈ విషయాన్నీ ఋజువు చేసేందుకు , ఏ సంస్థ నుండి లేదా కార్యాలయము నుండి ఇంటర్వ్యూ కు పిలిచారు ? ఏ ఉద్యోగానికి పిలిచారు ? ఇంటర్వ్యూ ఎక్కడ జరుగనున్నది చెప్పలేదు .
తత్సంబందిత ఇంటర్వ్యూ కార్డులు కూడా దాఖలు చేయలేదు . అలాగే మిగిలిన పిర్యాదిదారులుకుడా ఎవరికి జరిగిన నష్టాన్ని వారు ఋజువు చేసుకొనేందుకు ఎలాంటి ఆధారాలు దాఖలు చేయలేదు . అసలు వారే ఫోరం కు ఇంతవరకు రాలేదు .
పైన కూలంకుషంగా చర్చించిన విషయాలననుసరించి , మా అభిప్రాయమేమిటంటే పిర్యాదిదారులు దాఖలు చేసుకొన్న ఈ వ్యాజ్యము నందలి ఆరోపణలలో ఏ ఒక్క ఆరోపణ కూడా ఋజువు చేయలేకపొయినారు . అలాగే వారు నష్టపోయామన్న ఆరోపణలు నిరాధారములు, నిర్హేతుకములు ,మరియు నమ్మశక్యముగా లేవు .అందువల్ల పిర్యదిదారులు ఈ వ్యజ్యమునందు కోరిన ఫరిహారము పొందుటకు అర్హులు కారు .
నాల్గవ అంశము : ఒకటి నుండి మూడు అంశము లందు చర్చించిన విషయముల ననుసరించి మరియు వ్యజ్యమునండున్న లోపభూయిష్టమైన ఆరోపణలను , సాక్షాలు లేని నిన్దాపుర్వక నష్టాలు, నిరాదారము లైన పరిహారములు, పిర్యాదిదారులు ప్రత్యామ్నాయ ప్రతినిధి ద్వారా వ్యాజ్య విచారణ జరుపు కొనుటకు ఫోరము యొక్క అనుమతి పొందకపోవుట, 2,3,6,7,8,9,11,12,13,మరియు 14 వ పిర్యాదిదారులు బాధ్యతారహితంగా ఫోరము నందు గైరుహాజరగుట, మొదలగు విషయాలు పరిశీలించిన పిమ్మట పగటి ప్రయాణము నందు అనేక కారణాల వల్ల ప్రయాణీకుల కొరకు బస్సు ఆపవలసి వస్తుంది, అందువల్ల 28.09.2014 వ తేదీ ప్రయాణ సమయం లో ఒక గంట ఆలస్యమైంది అనే ప్రత్యర్ధుల వాదన సరైనదిగా భావించుట ధర్మమనిపిస్తుంది .పర్యవసానంగా ఈ దావా అసత్యారోపణలతో నిండినది , సత్యదూరమైనది, పరిహారమును పొందుటకు అనర్హమైనది .
కనుక ఈ దావా అన్నివిధాలా తిరస్కార యోగ్యమైనది.
వ్యాజ్య ఫలం : పైన వివరంగా చర్చించిన అన్ని అమ్సముల ఆధారంగా
ఈ వ్యాజ్యము ఖర్చులు లేకుండా తిరస్కరించడమైనది.
నాచే లిఖిత పరచి ,తప్పొప్పుల సవరణ చేసి , మా ద్వారా ఈ రోజు
అనగా 04వ తేది ,ఆగష్టు మాసము ,2015 న తీర్పు వెలువరించడ మైనది .
మహిళా సభ్యురాలు అధ్యక్షులు
C.C.No.72/2014
APPENDIX OF EVIDENCE
Witnesses Examined on behalf of Complainants.
PW-1: C. Dhananjaya Naidu (Chief Affidavit filed).
Witnesses Examined on behalf of Opposite Parties.
RW-1: G. Navarathna Raju (Chief Affidavit filed).
EXHIBITS MARKED ON BEHALF OF THE COMPLAINANTs
Exhibits (Ex.A) | Description of Documents |
Legal Notice Dt: 01.10.2014. | |
Registered post receipts (Original) (4). | |
Acknowledgement cards from respondents 1, 2, 3 and returned cover of R4. | |
Reply from Depot Manager. Dt: 17.10.2014. | |
Bus tickets purchased by complainants (7). |
EXHIBITS MARKED ON BEHALF OF THE OPPOSITE PARTYs
Exhibits (Ex.B) | Description of Documents |
1. | Statistical and Ticket Accountal Record in Original with Memo filed on behalf of Opposite Party No.1 and 2. |
2. | Log Sheet (Original). Dt: 28.09.2014. Bus No.AP16Z-0153 Code No.153 filed by Opposite Party No.1 and 2. |
PRESIDENT
Copies to:
Consumer Court | Cheque Bounce | Civil Cases | Criminal Cases | Matrimonial Disputes
Dedicated team of best lawyers for all your legal queries. Our lawyers can help you for you Consumer Court related cases at very affordable fee.